ఈ రాజ్యంలో న్యాయం కొందరికే..
అధికారం బట్టి అందుతుంది..
కులం బట్టి దొరుకుతుంది..
గ్రామానికో ఆగాయిత్యం జరిగిన..
జాడ లేనివి ఎన్నో.. పసి పిల్లలను పీక్కు
తిన్న మానవ మృగాలని మేపుతున్న
వారేందరో.. సామాన్యుడికి న్యాయం
నడిచి రాదు.. ప్రతి గల్లీలో గలీజు పనులు
జేసి దర్జాగా తిరుగుతున్న వారేందరో..
అణచబడిన వారి గుడిసెల్లో నుదుటి మీద
ఎర్రని సిందూరాన్ని చేరపి గోడలకు
చిందిన నెత్తుటి మరకలు మాయం
జేస్తున్నవారు ఎందరో.. న్యాయం అందరికి
కాదు కొందరికే..
- ముచ్కర్ సుమన్ గౌడ్
