దీపావళి (Diwali) సందర్భంగా నార్నూర్, గాదిగూడ మండలంలో ఆదివాసులు (Adivasis) మంగళవారం గోవర్ధన్ గుట్టలపై గోమాతలకు ప్రత్యేక పూజ(Puja)లు నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. గుస్సాడీలకు, పశువుల కాపరులకు, పశు పోషకులకు నూతన వస్త్రాలు, కానుక(Gift)లు అందజేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు (Wishes) చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ (JAC) చీఫ్ మెస్రం రూప్ దేవ్, ఇంద్రవెల్లి (Indravelli) మార్కెట్ వైస్ మాజీ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఉప సర్పంచ్ రాయి సీడం రూప్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.
