క్రిమినల్ రియాజ్‌ను పట్టుకునే ప్రక్రియలో గాయపడ్డ సయ్యద్ ఆసిఫ్‌ను డీజీపీ (Dgp) శివధర్ రెడ్డి మంగళవారం అబిడ్స్‌లోని గ్రీన్ ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన వెంట శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్(Mahesh M Bhagavat), హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదని చెప్పారు. ఒక ఎముక తప్ప మిగతా ఏమి లేని పరిస్థితుల్లో హాస్పిటల్‌కి వచ్చాడని, డాక్టర్లు ఆపరేషన్ చేసి మళ్ళీ చెయ్యిని ఒరిజినల్ షేప్ కు తీసుకొని వచ్చారని చెప్పారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అసిఫ్ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. అసిఫ్ చాలా గొప్ప సాహసం చేశాడు. క్రిమినల్ (Criminal) చేతిలో కత్తి ఉన్నా ధైర్యంగా అతనిని పట్టుకున్నాడు. అసిఫ్ వెల్డింగ్ పని చేసుకొని జీవించేవాడు. అసిఫ్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయాల్సిన సాయం చేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. కోలుకోవడానికి మాత్రం రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
