Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Suraksha | ‘సురక్ష‘ 9వ ఆవిర్భావ దినోత్సవం (పార్ట్3)

Suraksha | ‘సురక్ష‘ 9వ ఆవిర్భావ దినోత్సవం (పార్ట్3)

సురక్ష సేవా సంఘం కరోనా కష్టకాలం లో HAND OF HOPE అనే సంస్ధ సహాకారం తీసుకుని…500 మంది కోవిడ్ పేషెంట్లకు విజయవంతంగా.. పాజిటివ్ నుండి నెగిటివ్ గా చేయడం జరిగింది. వారి క్వారంటైన్ సమయంలో రెండు నెలలకి సరిపడా నిత్యవసర వస్తువులు, మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.


ఉచిత కంటి ఆపరేషన్లు
శ్రీ ధన లక్ష్మి ఆప్టికల్స్ వారి సౌజన్యం తో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేపించి 400 మంది వృద్దులకు ఉచిత కేటరాక్ట్ ఆపరేషన్లు చేపించడం జరిగింది.


ఉచిత వైద్య శిబిరాలు
హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం అనే సంస్ధ తో కలిసి సురక్ష సేవా సంఘం నగరానికి దూరంగా ఉన్న గ్రామాల్లో.. మురికి వాడల్లో..ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి ఉచిత మందులు, ఉచిత కంటి అద్దాలు, ఉచిత X రే,ECG వంటి వైద్య సేవలు చేయడం జరిగింది.


రక్త పరీక్షా శిబిరాలు
ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి CSR విభాగం సహాకారం తో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నూ రక్త పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి జీవన శైలి వ్యాధులైన కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ, షుగర్ కి సంబంధించి పరీక్ష లు చేసి వ్యాధి తీవ్రతను బట్టి వైద్య సహాయం చేయటం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం మొత్తం 14000 రక్త నమూనాలు సేకరించడం జరిగింది. ఎవరైనా ప్రమాదం లో ఉన్నారని రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ అయితే… అట్టి వారికి వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది
అంతే కాకుండా ముత్తూట్ వారి సహాకారం తో వివాహ కానుకలు, శస్త్ర చికిత్స లకు ఆర్థిక సహాయం, ఉన్నత చదువులు కొరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు
రాష్ట్ర వ్యాప్తంగా… దిక్కూ మొక్కూ లేని.. ఒంటరిగా బతుకుతున్న వృద్దులు తనువు చాలించి నప్పుడు, ఆరోగ్యం క్షీణించి మరణించినప్పుడు.. సమాచారం రాగానే.. గ్రూప్ సభ్యుల నుండి విరాళాలు పోగుచేసి ఇప్పటి వరకు 300 పై చిలుకు అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది.


RELATED ARTICLES
- Advertisment -

Latest News