శేరిలింగంపల్లి: 2025 డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర మాస్టర్స్ అథ్లెట్ పోటీలకు రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ ఎంపిక అక్టోబర్ 26వ తేదీన పిజెఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు మాస్టర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. సెలక్షన్స్‌కు సంబంధించిన పోస్టర్ని జిల్లా మాస్టర్స్ ప్రతినిధులతో కలిసి పీజేఆర్ స్టేడియంలో ఆవిష్కరించారు. మాస్టర్ పోటీల్లో భాగంగా రన్నింగ్, జంపింగ్, త్రో, వాకింగ్ తో పాటు ఇతర క్రీడల్లో పోటీలు నిర్వహించ నున్నట్టు, ప్రతిభచూపిన వారిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కొండ విజయ్ తెలిపారు. పోటీల్లో 30 సంవత్సరాలనుండి 80 వయస్సు గల వారు అర్హులని నిర్వాహకులు పేర్కొన్నారు. అక్టోబర్ 26వ తేదీన ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె సురేందర్, జనరల్ సెక్రటరీ స్వాతి ధర్మపురి, ఉపాధ్యక్షుడు డగ్లస్, ట్రెజరర్ శివలీల రెడ్డి, మానస, సవిత, జ్యోతి, శైలజ, రాజు, రంగారావు, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
Athletics | రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ ఎంపిక 26న
RELATED ARTICLES
- Advertisment -
