Tuesday, October 28, 2025
ePaper
Homeఆరోగ్యంhealth | వెన్నముక పటిష్ఠంగా ఉంటేనే జీవితం సులభం..

health | వెన్నముక పటిష్ఠంగా ఉంటేనే జీవితం సులభం..

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక జీవన శైలి వల్ల చిన్నా  పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వెన్న ముక సమస్యలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి. పాఠశాల,కళాశాల విద్యార్థులు కూడా అధిక బరువు బ్యాగులను మోయడం వలన కాలేజ్‌, యునివర్సీటీ యువత తరగతి గదుల్లో ఎక్కువ సేపు కూర్చోలేక వెన్నముక సమస్యతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించడం ద్వారా నయం చేయవచ్చును.

వరల్డ్‌ స్పయిన్‌ డేను మొదటగా 2008 ఆక్టోబర్‌ 16న నిర్వహించబడింది.దీనిని వరల్డ్‌ ఫేడ్‌రేషన్‌ ఆఫ్‌ చిరోప్రాక్టిక్‌ (డబ్లుఎఫ్‌సీ) ప్రారంభించింది. దీని ముఖ్యఉద్ధేశం వెన్నముక సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగామాన పెంపోందించడం. వాటి నివారణ చికిత్స పట్ల చైతన్యం కల్పించేందుకు ఒక గ్లోబల్‌ వేదికను అందించడమే. ఈఏడాది 2025 సంవత్సరం  థీమ్‌ ‘‘మీ వెన్ను ముకలో పెట్టుబడి పెట్టండి’’. ఆరోగ్యవంతమైన ఆరంభాలు ఆశాజనకమైన భవిష్యత్తులు, అనే నినాదంతో వెన్ను నోప్పులు అవలంబిత వైకల్యాల నివారణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రతి ఏడాది అక్టోబర్‌ 16నాడు వరల్డ్‌ స్పెయిన్‌ డే నిర్వహిస్తున్నా సందర్భంగా ఆదాబ్‌ పాఠకులకు అందిస్తున్న పరిశీలనాత్మక ప్రత్యేక కథనం..

డబ్యూ.ఏఫ్‌.సీ… గురించి.

చిరోప్రాక్టిక్‌ ప్రపంచ సమాఖ్య ప్రధాన కార్యలయం కెనడా దేశం ఒంటరియో రాష్ట్రంలో ఉంది. డబ్యూ ఎఫ్‌ సీ లాభాపేక్ష సంస్థ ఇది గ్లోబల్‌ స్థాయిలో చిరోప్రాక్టిక్‌ వృత్తిని ప్రాతినిథ్యం వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 800పైగా అధికారిక సంస్థలకు అనుబంధంగా ఉంది. దీనిని లక్ష్యం చిరోప్రాక్టిక్‌ సేవలను ప్రోత్సహించడం మరియు చిరోప్రాక్టిక్‌ శాస్త్రం,  కళను అభివృద్ధి చేయడం.ఇది తొలిగా అక్టోబర్‌16, 2008లో ప్రారంభించబడింది. అయితే అధికారికంగా 2012 సంవత్సరంలో మొదటిసారిగా ప్రపంచ వెన్నుముక దినోత్సవాన్ని గుర్తించింది. తొలిసారిగా ఎంచుకున్న ఫస్ట్ థీమ్‌ ‘‘నిలబడి కదలండి’’ అనే అంశంతో ప్రారంభమైంది. మెడ మరియు వెన్నుముక సమస్యలు వాటి నిర్వహాణపై గ్లోబల్‌ అవగాహాన పెంచే ప్రయత్నం చేస్తోంది.

తక్కువగా కదలటం ఎక్కువగా బాధపడటం.. 

ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఎక్కువ సమయం కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేయడం స్మార్ట్‌ఫోన్లులు వినియోగిస్తూ అధిక సమయం ఒకే చోట కూర్చుండిపోవడం, ఊబకాయం, శారీరక శ్రమలేకపోవడం, జీవనశైలిలో మార్పులు, ధూమపానం, కార్లు ద్విచక్రవాహానాలపై అధిక దూరం ప్రయాణం చేయడం, గుంతలు ఉన్న రహాదారిపై వాహానాలు నడపడం ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపేవారిలో వెన్నముక సమస్యలు వస్తున్నాయని అధ్యాయనాల ద్వారా తెలుస్తోంది. అందుకే తక్కువగా కదలటం ఎక్కువగా బాధపడటం జరుగుతుంది. 

భాగ్యనగరంలో బాధితులు అధికమే…

రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు హైదరబాద్‌ నగరంలో ప్రతిరోజు వందలమంది వ్యక్తులు వెన్నముక సంబంధింత సమస్యలతో ఆర్థోపేడిక్‌ డాక్టర్లను సంప్రదిస్తున్నారు. భాగ్యనగరంలో వందలాది మంది ఆర్థోపెడిక్‌ సర్జన్లు ఉన్నారని, అదే స్థాయిలో న్యూరో సర్జన్లు ఉన్నారు. ప్రతి రోజు ఒక డాక్టరు వద్దకు 10 మంది వరకు వెన్నెముక సమస్యలతో చికిత్స కోసం సంప్రదిస్తున్నారు.

డిస్క్‌ల సహాజ అరుగుదల…

సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది వెన్నపూస మధ్యలో ఉండే డిస్క్‌లు అరిగి గ్యాప్‌ ఏర్పడుతోంది. గ్యాప్‌ ఏర్పడిన సమయంలో కొత్తగా కండరం పెరగడం లేదా ఎముక పెరగడం జరిగి నడుము నొప్పి తుంటి నొప్పి, కాలు జాలు కాలు తిమ్మిరి, కాలు పటుత్వం, తగ్గిపోవడం, మల మూత్రాలను ఆపుకోలేక నియంత్రణ కోల్పోవడం. జరుగుతుంది. డిస్క్‌ జారినప్పుడు, గజ్జల్లో నొప్పి తొంటి నొప్పివస్తుంది. కాళ్లల్లో స్పర్శ తగ్గిపోతుంది.వెన్నముక ఆకారం మారిపోతుంది.

90శాతం అవే తగ్గిపోతాయి..

వెన్నముక డిస్క్‌ సమస్యలు వచ్చిన మొదటి సారి నూటికి 90 శాతం అవే తగ్గిపోతాయి. తొలిసారి డిస్క్‌ సమస్య వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. 48 గంటల పాటు నడుముకు విశ్రాంతి ఇస్తే నొప్పి తగ్గుతోంది. వేడి నీళ్లు కాపడం ఫీజీయోథేరపి నొప్పి నివారణ మాత్రలు కొద్దిపాటు వ్యాయామం ద్వారా మూడు వారాల్లో నొప్పి తగ్గిపోతుంది. రెండోసారి సమస్య వస్తే  50 శాతం ఎలాంటి వైద్యం చేయకుండానే తగ్గిపోతాయి. మొండిగా సమస్య ఉన్నవారికి తుంటికి ఇంజేక్షన్‌ ఇవ్వడం ద్వారా మూడు వారాల్లో నొప్పి తగ్గిపోతుంది. మూడోసారి మరలా డిస్క్‌ సమస్య వస్తే 20 శాతం మాత్రమే వాటంతట అవి తగ్గుతాయి. వీటికి తప్పనిసరిగా వైద్యం చేయాల్సి ఉంటుంది.  కీ హోల్‌ సర్జరీ ద్వారా ఎముక కండ కట్‌ చేయకుండా చిన్న రంద్రం ద్వారా జరిగిన ఎముకను సరిచేసి నొప్పిని నివారించవచ్చు.

కేవలం అపోహాలే మాత్రమే..

వెన్నముక సర్జరీలు సురక్షితం కాదనే అపోహా ప్రజల్లో ఉంది. సర్జరీ చేసే సమయంలో నరాలు దెబ్బతింటే  జీవితాంతం నడక ఉండదని భావిస్తారు. ఒక సారి సర్జరీ చేస్తే మరలా మరలా సర్జరీ చేయాల్సి వస్తుందనే అపోహా ప్రజల్లో ఉంది. సర్జరీ చేయించుకున్నా వారు వంగకూడదు. బరువు ఎత్తకుడదు. జీవితాంతం జాగ్రతలు తీసుకోవాలని  ప్రజలు భావిస్తారు. ఇవన్నీ కేవలం ఆపోహాలు మాత్రమే అంటున్నారు వైద్యులు..

ఆధునిక వైద్యం..

డాక్టర్‌ పి.వి.సత్యానారయణ మూర్తి 

స్పయిన్‌ సర్జన్‌, సిటిజన్‌ అసుపత్రి..నల్లగండ్ల…

వెన్న నొప్పిని చిన్న సమస్యగా తీసుకోవద్దు ఒక రోజు కంటే ఎక్కువగా నొప్పి ఉంటే వేంటనే వైద్యులను సంప్రదించాలి. వెన్నుముక వ్యాధికి వయసుతో సంబంధంలేదు. చిన్నా పెద్ద తేడాలేకుండా ఎవరికైన సమస్య రావచ్చు. వెన్నముక శస్త్రచికిత్సల్లో అత్యాధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ న్యావిగేషన్‌ న్యూరో మానిటరింగ్‌, ఎండోస్కోప్‌,  కీహోల్‌ ఆపరేషన్‌లతో వెన్నముక సమస్యలను చాల సులువుగా నయం చేస్తున్నారు. వ్యాధి నిర్థారణలో ఏమ్మారై వంటి ఆధునిక వైద్య పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేయటం బరువు నియంత్రణలో పెట్టుకోవడం కూర్చుని పనిచేసేవారు ప్రతి రోజు గంటకు ఒకసారి లేచి నడవడం అధిక సమయం ఒంగి పనులు చేయకుండా ఉండటం. అధిక బరువులు ఎత్తకుండా ఉండటం ద్వారా సమస్యలు దరిచేరవు..యువత రోజుకీ కనీసం అరగంట శారీరక శ్రమ చేయాలి.ఇది వెన్నముకకు సురక్షితంగా ఉంచుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News