కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
-నాబార్డు డీడీఎం కృష్ణ తేజ
చిలిపిచేడ్, ఆదాబ్ హైదరాబాద్:
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు డీడీఎం కృష్ణ తేజ పేర్కొన్నారు.శుక్రవారం చిలిపిచేడ్ మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో నాబార్డు రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు యాషిన్ తో కలిసి నాబార్డు డీడీఎం కృష్ణ తేజ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని అన్నారు.ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని,బాగా ఎండబెట్టి తాలు మట్టి లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.తూకం వేసిన వెంటనే రైతులకు తమ బ్యాంక్ అకౌంట్,పట్టా పాస్ బుక్,ఆధార్ కార్డు జిరాక్స్ సెంటర్ ఇంచార్జ్‌కు అందజేయాలన్నారు.ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు.ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు,సాధారణ రకం 2369 రూపాయలు,సన్నరకం వరి ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తారని డీడీఎం కృష్ణ తేజ,ఏప్పీఓ అధ్యక్షుడు యాషిన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ అనిత,ఎఫ్పీఓ సిబ్బంది,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.