చిన్నారులలో తీవ్రమైన రోగాలకు, మరణాలకు కారణమవుతున్న ప్రమాదకర దగ్గు మందుల(cough medicines)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ(bans ) చర్య తీసుకుంది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరప్‌లను విక్రయించరాదని ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్టాల్లో ’కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ’కోల్డ్ రిఫ్’ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం డీసీఏ ప్రకటించింది. చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ చర్య తీసుకుంది.
రీలైఫ్, రెస్పీఫ్రెష్`టీఆర్ అనే రెండు సిరప్‌లను విక్రయించరాదు అని తెలంగాణ ప్రభుత్వం(Telangana government) అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం విశేషం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ సిరప్ కారణంగా 16 చిన్నారుల మరణాలు చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు ఇవ్వకూడదని అధికారిక సూచనలు కూడా జారీ అయ్యాయి. కాంచీపురంలో తయారు చేసిన కోల్డ్‌రిఫ్(Coldrif) సిరప్‌పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ సిరప్‌ను తక్షణం తెలంగాణలో విక్రయించరాదని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సినట్లు సూచించబడింది.