Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణUttam Kumar Reddy | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్‌న్యూస్

Uttam Kumar Reddy | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్‌న్యూస్

రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోందని వెల్లడించారు. ఈ సీజన్‌లో రైతుల నుంచి మొత్తం రూ.21,112 కోట్లతో 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంగళవారం హైదరాబాద్ లోని సివిల్ సప్లైస్ భవనంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సన్నధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ పథకం కొనసాగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News