Monday, October 6, 2025
ePaper
HomeతెలంగాణBC RESERVATION | సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..

BC RESERVATION | సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.. పిటిషనర్‌కు సూచించింది.

బీసీ రిజర్వేషన్ల అంశంలో గోపాల్ రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందన్న పిటిషనర్ తరఫు లాయర్ వివరణ ఇచ్చారు. అనంతరం, ధర్మాసనం రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. దీంతో, పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పడంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది అంగీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్ల అంశంపై గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్‌లో వాదనలు వినడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, డాక్టర్ వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News