తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాగిరెడ్డి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల విభాగం (Telangana Disaster Response Fire Services) డైరెక్టర్ జనరల్‌గా పని చేసారు.
ఇంతకాలం తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వీసీ సజ్జనార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సజ్జనార్ స్థానంలో పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హోమ్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
టీజీఎస్‌ఆర్‌టీసీ సేవలను ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సంస్థను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడం, అలాగే ప్రయాణికులకు అందించే సేవల నాణ్యతను పెంచడం వంటి అంశాలకు వై. నాగిరెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు :