జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక (Jubilee Hills By-election) కోసం తెలంగాణ ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం ఓటర్ల సంఖ్యలో 1.61 శాతం పెరుగుదల నమోదైంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,367 మంది పురుష ఓటర్లు, 1,91,590 మంది మహిళా ఓటర్లు మరియు 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 980 మంది ఓటర్లు ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని వార్తలు :