హైదరాబాద్‌లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పుపై సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎట్టకేలకు ఆమోదించింది. “తెలుగు తల్లి” ఫ్లైఓవర్ ను “తెలంగాణ తల్లి” ఫ్లైఓవర్ గా మారుస్తూ సచివలయం దగ్గర ఉన్న పైవంతెన దగ్గర కొత్త బోర్డ్ ను పెట్టారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, గర్వాన్ని మరింత పెంపొందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ విజయలక్ష్మి మీడియాకు తెలిపారు.
లోయర్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ మధ్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి 1997లోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి నగరంలో ఒక ముఖ్యమైన కూడలిగా మారింది. అయితే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దీని పేరును తెలంగాణ తల్లిగా మార్చాలనే డిమాండ్ బలంగా వినిపించింది.
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పేరు మార్పు అంశంపై అనేకసార్లు చర్చించినా, తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ఉన్న నూతన GHMC బోర్డు ఈ విషయంలో ధైర్యంగా అడుగు వేసి, కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
మరిన్ని వార్తలు: