Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణBathukamma | సరూర్ నగర్ స్టేడియం వద్ద ట్రాఫిక్ మళ్లింపు.. బతుకమ్మ వేడుకలు

Bathukamma | సరూర్ నగర్ స్టేడియం వద్ద ట్రాఫిక్ మళ్లింపు.. బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరగనున్న బతుకమ్మ(Bathukamma) వేడుకలు జరగనున్న నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో, సోమవారం సాయంత్రం 3:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్‌బీ నగర్ వైపు వెళ్లే వాహనాలను ఓమ్ని క్రాస్ రోడ్డు వద్ద నాగోల్ వైపు మళ్లిస్తారు.

చింతలకుంట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వచ్చే వాహనాలను చింతలకుంట క్రాస్ రోడ్డు వద్ద సాగర్ క్రాస్ రోడ్స్–కర్మన్‌ఘాట్ మీదుగా మళ్లిస్తారు. బతుకమ్మ(Bathukamma) వేడుకలకు హాజరయ్యే వారి సౌలభ్యం కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్, చిత్ర లేఅవుట్, ఆర్.ఆర్. జిల్లా కోర్టు కాంప్లెక్స్, బజాజ్ గోడౌన్ (సిరీస్ రోడ్), దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారులను ప్రత్యేక పార్కింగ్ స్థలాలుగా కేటాయించారు.

మరిన్ని వార్తలు :

విద్యార్థుల మానసిక ఆరోగ్యం – ప్రాథమిక హక్కు

RELATED ARTICLES
- Advertisment -

Latest News