Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణHarish rao | కృష్ణా నది జలాలపై హరీశ్ రావు ఆగ్రహం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు!

Harish rao | కృష్ణా నది జలాలపై హరీశ్ రావు ఆగ్రహం.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు!

హైదరాబాద్: కృష్ణా నది జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) మండిపడ్డారు. వారి అస్పష్టత వల్ల తెలంగాణ హక్కులకు హాని కలుగుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కృష్ణ నది జలాలపై వాళ్ళ పార్టీ వాళ్లకే స్పష్టత లేదని హరీష్ రావు(Harish rao) ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో 763 టీఎంసీలు సాధిస్తామని చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 18న మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తమకు 500 టీఎంసీలు ఇస్తే, మిగతా నీటితో వారు ఏమి చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు 904 టీఎంసీలు రావాలని అంటున్నారు. వీళ్ళ వైఖరి వల్ల తెలంగాణ కు నష్టం కలుగుతుంది అని అన్నారు.

రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నది నీటి పంపిణీలో 299:512 టీఎంసీల నిష్పత్తికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించి తెలంగాణకు ద్రోహం చేసిందని అని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఒప్పందంపై సంతకం చేసిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాము సెక్షన్ 3 కోసం కోట్లాడి 763 టీఎంసీల కోసం బేసిన్ వారీగా వాదనను బలోపేతం చేసుకున్నామని గుర్తు చేశారు.

సమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతులు తెచ్చామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక ఎన్ఓసీ తప్ప మిగతా అన్ని అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని స్పష్టం చేశారు. “కేసీఆర్ ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దారు. బ్యారేజీ కట్టారు, నీళ్లు ఎత్తిపోశారు. ఇప్పుడు వాళ్లు ఛత్తీస్‌గఢ్‌లో 50 ఎకరాల ముంపుపై ఒక ఒప్పందం చేసుకుని, మొత్తం ప్రాజెక్టును తామే నిర్మించినట్లుగా బిల్డప్ ఇస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తును 519 నుంచి 524 అడుగులకు పెంచాలని నిర్ణయించినా కాంగ్రెస్ ఏమీ మాట్లాడటం లేదని హరీశ్ రావు ఆరోపించారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను ఎడారులుగా మార్చడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. కృష్ణా నది జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోవడం లేదని అన్నారు.

మరిన్ని వార్తలు :

తెలంగాణలో వికసిస్తున్న కమలం

RELATED ARTICLES
- Advertisment -

Latest News