Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణBC reservations | బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

BC reservations | బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తూ ప్రభుత్వం తెస్తున్న జీవోపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని పిల్‌ దాఖలు కాగా… బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషనర్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్‌ ఎలా వేస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ.. రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఆదేశాలు ఇవ్వాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే స్థానిక సంస్థల్లో ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ ఇస్తే 50 శాతం దాటుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు, పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 50 శాతం మించకూడదని పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ రెండు పిటిషన్లను కొట్టివేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News