ప్రభుత్వ ప్రకటనలపై రైతుల మండిపాటు
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యూరియా కొరత తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు సహకార సంఘ కార్యాలయాలకు మహిళలతో సహా వెళ్లి యూరియా కావాలంటూ లైన్ లో నిలబడిన పరిస్థితులు అంతంత మాత్రమే. కానీ ఈ ఏడాది వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం.. అవసరానికి మించి అమ్మకాలు చేసినట్లు చెబుతుండగా, మరోవైపు రైతులు మాత్రం యూరియా లేదంటూ ఆందోళన చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో సైతం మంత్రి అచ్చన్నాయుడు యూరియా కొరత లేదన్నారు. కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు.
కానీ, ఈ పరిస్థితి మంగళవారం పలు గ్రామాల్లో నెలకొంది. రైతులు వేలల్లో ఉండగా, యూరియా కట్టలు మాత్రం వందల్లో సరఫరా జరిగింది. ఈ విషయమై అక్కడ వైసిపి నాయకులు మాట్లాడుతూ.. అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారని ఆగ్రహించారు. వాస్తవ పరిస్థితులు చూస్తే యూరియా అవసరమైన స్థాయిలో సరఫరా జరిగితే రైతులు ఎందుకు రోడెక్కుతారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఎక్కడైనా యూరియా అంటూ ఆందోళన చేస్తుంటే కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వం ఆదేశిస్తుందంటూ, ఉమా ఆవేదన చెందారు. మొత్తం విూద మంగళవారం పెనుగోలను లో 25 టన్నులు, రాజవరం 5 టన్నులు, ఊటుకూరు 16 టన్నులు యూరియా సరఫరా జరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారి వల్లభనేని హరీష్ మాట్లాడుతూ.. గత ఏడాది కంటే ఈ ఏడాది మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎక్కువ యూరియాను సరఫరా చేసి రైతులకు అందజేసినట్లు తెలిపారు.