Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్De Kock | రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న క్వింటన్‌ డికాక్‌

De Kock | రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న క్వింటన్‌ డికాక్‌

సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీతో వన్డేలకు గుడ్‌ బై చెప్పాడు. ఆ తర్వాత ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జరిగిన 2024 టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడాడు. ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత సఫారీ జట్టు తరఫున డికాక్‌ మళ్లీ బరిలోకి దిగలేదు. ఇప్పుడు రిటైర్‌మెంట్ వెనక్కితీసుకోవడంతోనే వచ్చే నెలలో పాకిస్థాన్‌తో జరగనున్న టీ20, వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత పొట్ట ఫార్మాట్‌లో ఆడకపోయినా, రిటైర్‌మెంట్ మాత్రం ప్రకటించలేదు. ఇక టెస్టులకు 2021లోనే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అదే ఏడాది టెస్టుల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది డికాక్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకోలేదు.

ఇక తాజాగా రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వెంటనే రెండు ఫార్మాట్లలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లకు ముందు డికాక్‌ తిరిగిరావడం సౌతాఫ్రికా జట్టుకు బూస్ట్‌ ఇస్తుందనే చెప్పుకోవాలి. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌, ఆపై సంవత్సరం వన్డే ప్రపంకకప్‌ టోర్నమెంట్‌ ఉన్న నేపథ్యంలో డికాక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సౌతాఫ్రికా వచ్చే నెల నమీబియా, పాకిస్థాన్‌ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. ఇందులో అక్టోబర్‌ 11న నమీబియాతో ఏకైక టీ20, ఆ తర్వాత పాక్‌ టూర్‌లో రెండు టెస్టులు, మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాక్‌ పర్యటన అక్టోబర్‌ 12న ప్రారంభమై నవంబర్‌ 08న ముగుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News