రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయి..
ప్రాణాలు పోతున్నాయి… అసలు తప్పు ఎవరిది
వాహనం నడిపిస్తున్న వ్యక్తిదా… లేక గుంతల
మయంగా ఉన్న రోడ్డుదా… హెల్మెట్ లేకపోతే
ఫైన్..లైసెన్స్ లేకపోతే ఫైన్.. సిగ్నల్ దాటితే
ఫైన్.. ఇలా ఫైన్లపై ఉన్న శ్రద్ద రోడ్ల
నిర్వహణలో ప్రభుత్వంకు ఎందుకు అశ్రద్ధ..
గుంతలమయం రోడ్డుపై వాహనం క్రింద
పడి.. వెనకాల నుండి వస్తున్న వాహనం
తగలడంతో ప్రమాదానికి కారణమైన వ్యక్తి,
వాహనంపై కేసు నమోదు చేస్తున్నారు కానీ
ప్రమాదంగా ఉన్న రోడ్డుకు కారకులైన
అధికారులపై కేసు ఎందుకు చేయడం లేదు.
అధికారుల నిర్లక్ష్యానికి అన్యాయంగా పోతున్న
ప్రాణాలకు న్యాయం జరగదా..
- విశ్వనాథ్ అనంతగిరి