గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటించిన “కన్యాకుమారి” మూవీ అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈ నెల 17వ తేదీ (రేపటి నుంచి) స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాను మధుశాలినీ సమర్పణలో దర్శకుడు సృజన్ తన రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుందీ సినిమా. ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సృజన్ “కన్యాకుమారి”తో మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రంలో శ్రీకాకుళం అమ్మాయిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకున్న ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల ద్వారా మరింతగా ప్రేక్షకులకు చేరువకానుంది.
Kanyakumari | ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న కన్యాకుమారి
RELATED ARTICLES
- Advertisment -