Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKarimnagar | రీజనల్ పాస్ పోర్టు ద్వారా మరింత సేవలు సులభతరం

Karimnagar | రీజనల్ పాస్ పోర్టు ద్వారా మరింత సేవలు సులభతరం

  • పాస్ పోర్ట్ సేవ కేంద్రం అప్గ్రేడ్ చేయడ సంతోషకరం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • పాస్ పోర్ట్ ఆఫీస్కి నాకు అవినాభావ సంబంధం ఉంది: బండి సంజయ్
  • కరీంనగర్లో పాస్ పోర్టు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ పాస్ పోర్టు కేంద్రం రాష్ట్రంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పాస్ పోర్ట్ సేవ కేంద్రం అప్గ్రేడేషన్ చేయడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రీజనల్ పాస్ పోర్టు ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2009-14లో తను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇది ప్రభుత్వ భవనంలోనే ఉండాలని మున్సిపల్ భవనంలో ప్రారంభించుకున్నామని అన్నారు.

ఇప్పుడు ఇక్కడ పాస్ పోర్ట్ కార్యాలయంలో 250 స్లాట్స్ తో నడుస్తుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో 500 స్లాట్స్ ఇచ్చే మౌలిక సదుపాయాలు ఈ కార్యాలయానికి తీసుకొచ్చారన్నారు. సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కి వెళ్తే ఉదయం 4 కి వెళ్ళి లైన్లో నిలబడాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ద్వారా త్వరగా పాస్ పోర్ట్ పని పూర్తి అవుతుందన్నారు. ఉమ్మడి ప్రజలందరికీ విజ్ఞప్తి అందరు పాస్ పోర్ట్ తీసుకోండి.. భారతీయుడిగా గుర్తింపు ఉంటుంది. అవసరమున్నప్పుడే తీసుకుంటామంటే పాస్ పోర్ట్ త్వరగా రాదన్నారు.

పాస్ పోర్ట్ కార్యాలయాన్ని స్థల సేకరణ పూర్తి చేసుకొని సొంత భవనం నిర్మించుకోవాలన్నారు. గతంలో ఉపాధి కొరకు పాస్ పోర్ట్ అవసరం ఉండేది… ఇప్పుడు ఉన్నత విద్యావకాశాలు, ఉద్యోగాలు, టూరిజం పేరుతో విదేశాలకు వెళ్తున్నారు.చుట్టూ పక్కల జిల్లాల వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి పాస్ పోర్ట్ వచ్చి తీసుకుంటున్నారు. పాస్ పోర్ట్ కార్యాలయాన్ని ఆధునీకరించిన కేంద్ర మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. పాస్ పోర్ట్ ఆఫీస్కి నాకు అవినాభావ సంబంధం ఉంది ఇక్కడికి పాస్ పోర్ట్ ఆఫీస్ రావడానికి వందలసార్లు ఢిల్లీలో తిరిగానని గుర్తుచేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు పాస్ పోర్ట్ కేంద్రాలు కేటాయిస్తే పొన్నం ప్రభాకర్ చొరవ వల్ల కరీంనగర్కి పాస్ పోర్ట్ కేంద్రం వచ్చిందన్నారు. పొన్నం ప్రభాకర్ పాస్ పోర్ట్ కార్యాలయాన్ని తెస్తే దీనిని మేము అప్గ్రేడ్ చేశామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News