Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Chandra Babu Naidu | క్యాన్స‌ర్‌కు యూరియానే ప్రధాన కారణం

Chandra Babu Naidu | క్యాన్స‌ర్‌కు యూరియానే ప్రధాన కారణం

  • యూరియాను వాడకం తగ్గించండి
  • క్యాన్సర్ టాప్-5 రోగాల జాబితాలో ఏపీ ఉంది
  • రైతులు యూరియా తగ్గిస్తే రూ.800 నగదు ప్రోత్సాహకం
  • నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి
  • కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2026 నుంచి యూరియా వాడకం తగ్గించిన ప్రతి బస్తాకు రూ.800 చొప్పున నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తామని చెప్పారు. ఇది రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలను, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఒక విప్లవాత్మక చర్యగా భావించవచ్చు.

సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీని వాడకంపై రైతుల్లో చ్కెతన్యం తీసుకురావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్-5 రోగాల జాబితాలో ఉంది. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నంబర్-1కి వెళ్లిపోతాం. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలి. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదు. దీని అతివాడకంపై పంజాబ్ను కేస్ స్టడీగా చూడాలని చంద్రబాబు తెలిపారు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదు అన్నారు. అయితే, రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకొచ్చారు. మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు, దాని వల్ల మిరప పంటను చ్కెనా తిప్పి పంపించిందన్నారు. అలాగే, కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.

ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే, ఏపీ క్యాన్సర్ లో టాప్ 5 స్థానంలో ఉంది.. ఇలాగే, కొనసాగితే క్యాన్సర్లో ప్రథమస్థానంలోకి వెళ్తామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం.. ఇక, యూరియా కొరత లేదు.. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి అన్నారు. అలాగే, గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది.. జీఎస్టీపీ వృద్ధిలో ల్కెవ్ స్టాక్ పాత్ర కీలకం కానుంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2026 నుంచి యూరియా వాడకం తగ్గించిన ప్రతి బస్తాకు రూ.800 చొప్పున నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తామని చెప్పారు. ఇది రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలను, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఉద్దేశించిన ఒక విప్లవాత్మక చర్యగా భావించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News