Monday, September 15, 2025
ePaper
Homeతెలంగాణజీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణి కి 219 విన్నపాలు

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణి కి 219 విన్నపాలు

సోమవారం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 219 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు మొత్తం 68 విన్నపాలు రాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 151 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 55, సికింద్రాబాద్ జోన్ లో 33, శేరిలింగంపల్లి జోన్ లో 30, ఎల్బీనగర్ జోన్ లో15, చార్మినార్ జోన్ లో 11, ఖైరతాబాద్ జోన్ లో 7 ఫిర్యాదులు అందాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 68 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 43, ఇంజనీరింగ్ 6, హెల్త్ అండ్ శానిటేషన్, స్పోర్ట్స్ విభాగాలకు 5 చొప్పున, ట్యాక్స్ సెక్షన్, అడ్మిన్, ఫైనాన్స్, ల్యాండ్ అక్విజిషన్ విభాగాలకు 2 చొప్పున, ఎలక్షన్ విభానికి ఒక ఫిర్యాదు అందింది.

ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించిన జీహెచ్ఎంసీ అధికారులు సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు అందజేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, సి సి పి శ్రీనివాస్, అడిషనల్ సిసీపీ గంగాధర్, విజిలెన్స్ డి.ఎస్.పి నర్సింహా రెడ్డి, జేసీ శానిటేషన్ మోహన్ రెడ్డి, జేసి హెల్త్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News