- టీపీసీసీ చీఫ్ బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తిత్వం ఎంతో విశిష్టం
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారధిగా ఏడాది కాలం విజయవంతమైన ప్రయాణం
- నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహమత్ నగర్ గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి
- విషయం పరిశీలన, విస్తృతంగా సంభాషించడం ఈయనకు మకుటాలు
- విపక్ష పార్టీలను ఇరుకున పెట్టగల పరిజ్ఞానం
- సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించడం ఈయన నైజం
- సౌమ్యమైన మనస్తత్వం, సన్నిహితంగా మెలగడం ఈయన బలం
- నిగర్విగా, అజాత శత్రువుగా రాజకీయ రంగంలో ఆయనకు పేరు
- నమ్మిన సిద్ధాంతాన్ని గౌరవించడం.. నచ్చిన దారిన వెళ్లడం ఆయన ప్రత్యేకత
- జనహిత పాదయాత్రతో జనం సాధక బాధలను తెలుసుకునే ప్రజా నాయకుడు
- ఒక్క ఏడాది టీపీసీసీ చీఫ్‌గా విజయవంతమైన జర్నీలో ఎలాంటి మచ్చలేని నాయకుడు
- బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారికి శుభాకాంక్షలు అందిస్తున్న పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్
ఎప్పుడూ ఆ పెదాలు చిరునవ్వును చిందిస్తూనే ఉంటాయి.. ఆయన కళ్ళు ఆర్తిగా అందరినీ గమనిస్తూనే ఉంటాయి.. సమస్య ఏదైనా చిటికెలో పరిష్కరించే ఆలోచనలు ఆయన మెదడులో కదలాడుతూ ఉంటాయి.. ఆప్యాయంగా పలకరించడం.. అన్యాయం ఎదురుగా కనిపిస్తే ప్రశ్నించడం.. అధిష్టానానికి విధేయత చూపడం.. అందరిలో ఒకడిగా.. ఒక్కడే అందరికీ ఆత్మీయుడిగా ఆయన రాజకీయ ప్రయాణంలో బొమ్మా, బొరుసు అనే రెండు పార్శ్వాలతో ముందుకు సాగిపోతూ.. అందరి తలలో నాలుకగా విజయవంతమైన ప్రయాణాన్ని సాగిస్తున్న విశిష్ట రాజకీయ నాయకుడు ఆయన.. 38 ఏళ్ల సుదీర్ఘ తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా.. విశిష్టమైన సేవలు అందిస్తున్న విలక్షణ నాయకుడు.. ఎన్నో ఏళ్ల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.. సొంత పార్టీలో అందరినీ కలుపుకుపోతూ.. విపక్ష పార్టీలకు సరైన సమయంలో సమయస్ఫూర్తిగా సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్న ఆయన బొమ్మా మహేష్ కుమార్ గౌడ్.. ఈయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.. నమ్మిన పార్టీని, నమ్మిన సిద్ధాంతాలను తుచ తప్పకుండా పాటిస్తూ విజయవంతమైన నాయకుడిగా తనకు తాను ఆవిష్కృతం చేసుకున్న విలక్షణ నాయకుడు ఆయన..టీపీసీసీ అధ్యక్షుడిగా సంవత్సర కాలం విశిష్ట బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎందరికో చుక్కానిగా నిలుస్తున్నారు..
అది 1966 సంవత్సరం, మే నెల 24 వ తేదీ.. బొమ్మా గంగాధర్ గౌడ్, బొమ్మా మణెమ్మ పుణ్య దంపతులకు, నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహమత్ నగర్ గ్రామంలో బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. ఆయనకు భార్య సంధ్యా రాణి, ఇద్దరు ముద్దులొలికే కుమారులు ఋత్విక్ గౌడ్, ప్రణవ్ గౌడ్‌లు ఉన్నారు. మహేశ్ గౌడ్ 38 ఏళ్ల సుదీర్ఘ కాలం నుంచి తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ సేవకు అంకితం చేశారు. ఇక 1986-1990 కాలంలో ఆయన ఎన్.ఎస్.యూ.ఐ. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో నిజామాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక 1998లో యువజన కాంగ్రెస్‌లో సెక్రెటరీగా ఎంతో కృషి చేశారు. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో 2012 నుంచి 2016 వరకు సెక్రెటరీగా, పార్టీ స్పోక్స్ పర్సన్‌గా విస్తృతమైన సేవలు అందించారు.. ఇక రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఆయనను అలంకరించాయి.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జూన్ 2021 నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక 2024 జనవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అటు తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సెప్టెంబరు 6, 2024న నియమించబడి బాధ్యతలు చేపట్టారు..టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన నాలుగవ నాయకుడు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదట పున్నాల లక్ష్మయ్య, తర్వాత ఉత్తం కుమార్ రెడ్డి, ఆ తరువాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
పీసీసీ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టినప్పటునుంచి మహేశ్ కుమార్ గౌడ్ విధి నిర్వహణలో తన మార్క్ చూపిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంకు, మరోవైపు పార్టీ కార్యవర్గంకు సమన్వయకర్తగా బాధ్యతయుతంగా విధులు నిర్వహిస్తూన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు, ప్రజల బాధలను ప్రభుత్వానికి చేరవేసేందుకు, పార్టీ కార్యకర్తల సాధక బాధలను తెలుసుకునేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ చేపట్టిన జనహిత పాదయాత్ర విజయవంతంగా ముందుకెళ్తుంది. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చే చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలను సక్సైస్ చేయడంలో సఫలీకృతుడయ్యారు. నగరంలో చేపట్టే నిరసన ర్యాలీలలో సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనేలా చేసి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విశిష్టమైన బాధ్యతలు నిర్వర్తించారు.. ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా నిలిచిపోయింది.. ఎన్నికల వ్యూహాల సమన్వయం చేయడం.. పత్రిక సమాఖ్య సభ్యులుగా.. టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా మహేష్ గౌడ్ ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు.
ముఖ్యంగా ఆయన ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి .. ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థాయికి చేరారు. విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యూఐలో ప్రవేశించిన ఆయన, నేడు కాంగ్రెస్‌లో అత్యున్నత పదవి దక్కించుకోవడం వెనుక ఆయన చేసిన కృషి సామాన్యమైనది ఏమీ కాదు.. ఎన్నెన్నో పదవులు ఆలంకించిన ఆయన ఒకటి రెండు సార్లు శాసన సభకు పోటీ చేసి ఓటమి పాలైనా ఆయనలో పట్టుదల సడలిపోలేదు. ఇక బీసీ సామూహిక సమైక్యతకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో నాయకత్వంలో సమానత్వం, సామాజిక న్యాయం, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన అనేక చర్చల్లో ఆయన స్వరం ప్రత్యేకతను చాటుతూనే ఉంది.. ఇక బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంపై టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఆయన స్పందించిన తీరు అజరామరం అందరూ కీర్తించారు.
ఇక కరాటేలో తనదైన ముద్రను వేశారు.. ఎంతో వైభవాన్ని అనుభవించారు. 2025 ఏప్రిల్‌లో బొమ్మా మహేశ్ గౌడ్ సాతవ డాన్ అంటే 7వ డాన్‌గా కరాటే బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. తెలంగాణ కారాటే అసోసియేషన్‌లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా ఇప్పటికీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు..

ఏది ఏమైనా బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అతను బీసీ నాయకుడైన అన్ని కులాల నాయకులతో సత్సంబంధాలు కలిగియున్నారు. నిమ్న వర్గాలు..అగ్ర వర్ణాలు అనే బేదం లేకుండా ప్రతి ఒక్కరితో అన్నదమ్ముల అనుబంధంతో పెనవేసుకుంటాడు. అందరి సమస్యలను తన సమస్యగా బావించే గొప్ప మానవతావాది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరితో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేసే కృషీవలుడు. ఇలాంటి సౌమ్యుడు పార్టీలోని అత్యున్నత స్థాయి పదవీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో ఆ పదవీకే వన్నె తెచ్చింది ఆయన వ్యక్తిత్వం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఒక్క సంవత్సర కాలం విజయవంతంగా పూర్తిచేసుకున్న ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత సేవలు అందించాలని.. ఎందరికో మార్గగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఆశిస్తున్నారు.