విద్యా వ్యవస్థ చిద్రావంద్రమయ్యింది.. తరగతి గదులు మూతపడనున్నాయి.. విద్యార్థుల కళలు మూగబోనున్నాయి.. తల్లిదండ్రుల ఆశలు కన్నీళ్లుగా ఇంకిపోనున్నాయి.. ప్రభుత్వాలు మౌనంగా చేతులెత్తుకుని కూర్చుంటే.. సమాజ భవిష్యత్తు, విద్యార్థుల హక్కులు ఏంకావాలి.. కళాశాలల గదులు మూతపడటం.. అంటే విద్యా భవనాల సమస్య కాదు. ఒక తరం భవిష్యత్తుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ, గత పాలకులు చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ పొతే.. ఈ తరం భవిష్యత్తు పతనమయిపోదా..? ఓ ప్రభుత్వమా చెరిపేసిన చరిత్రను మళ్ళీ తిరిగిరాయి..!
- వాసు