Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆజ్ కీ బాత్రాజ‌కీయ చ‌ద‌రంగం

రాజ‌కీయ చ‌ద‌రంగం

తెలంగాణం అధికారపు ఆటలో గద్దె మారితే గడియారం ఆగుతుందా..? గులాబీ వసంతం వెనక వణికించే పాత వడగండ్ల వానలు.. వైఫల్యం నీళ్లలా పాకినా, ప్రచార రథమైన కాళేశ్వరాన్ని పెట్రోల్‌ డబ్బాలో ముంచినది ఎవరు? వీధిలో కూలీని అడిగితే దోపిడీయే గుర్తుకు వస్తుంది? అధికారం ఇచ్చినోళ్లు ఫలితం అడిగితే అవినీతిని దాచిపెట్టి అభివృద్ధి కనపిస్త లేదా అని దబాయింపులు? ‘‘దివాలా రాష్ట్రం!’’ అంటారు.. ఆ దివాలా కొట్టించింది ఎవరో మాత్రం మరిచినట్లు ప్రవర్తిస్తారు! పార్టీ మారితే పాపాలు కూడా పుణ్యాలవుతాయా! కండువా రంగు మారితే చరిత్ర తిరగరాయగలమని కలలు కంటారా? పాలనను పరుగులు పట్టించే ఉద్యోగుల డిఏలు-పీఆర్సీ ఏదంటే?భారమంటారు.. ఓటు వేయగానే గుర్తొచ్చే అభివృద్ధి, ఓటుకు ముందు ఇచ్చే అమలు కాని హామీ (ఉపన్యాసా)లు నమ్మడమే అజ్ఞానం!పాలన అంటే?పాలకులకు పండుగ – పాలితులకు గుదిబండ కారాదు..

RELATED ARTICLES
- Advertisment -

Latest News