కమిషనర్ బాలమాయదేవికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ వినతి
మాసబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల యొక్క కమిషనర్ బాలమాయదేవికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రవి ప్రసాద్ గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి ఓవర్సీస్ స్కాలర్షిప్ సమస్యలను వివరించారు. నగరంలోని విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించుటకు గాను బీసీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తులపై తనిఖీలు పూర్తయి నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందజేయటంలో జాప్యం జరుగుతున్నదని ఆయన తెలిపారు. విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం వృధాగా మారుతున్నం దున దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అందరికీ వెంటనే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందజేయవలసిందిగా కమిషనర్ బాలమాయదేవికి వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.