Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణరేషన్ రసీదు అడిగి తీసుకోండి

రేషన్ రసీదు అడిగి తీసుకోండి

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే రేషన్ షాపుల్లో.. రేషన్ రసీదు ను ప్రజలు అడిగి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మర్రిగూడ లో చౌక దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు రేషన్ తీసుకున్నాక రేషన్ తాలుకు రసీదు కూడా అడిగి తీసుకోవాలని సూచించారు. జాతీయ ఉస్పత్తి పథకంలో.. పారాదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సాంకేతిక మార్పులు వచ్చాయన్నారు. ఐనా కానీ ప్రజలు చౌక దుకాణాల నుంచి రేషన్ వస్తే చాలు అన్న చందాన రసీదు లు అడిగి తీసుకోవడంలో ఆసక్తి చూపెట్టకపోవడం వల్ల రేషన్ లో అక్రమాలు జరిగేందుకు అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.లబ్ది దారులు ఎంత జాగరూకత గా ఉంటే.. అన్ని మోసాలను, అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని రఘునందన్ స్పష్టం చేశారు. కొందరు డీలర్లు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి, అన్ని సరకులు ఇచ్చినట్టు రసీదు తీసి, జనం అడగటం లేదు కదా అని తమ వద్దే పెట్టుకున్నారని రఘునందన్ ఆక్షేపించారు. లబ్ది దారులకు రేషన్ రసీదు ఇవ్వడం కూడా నియమ నిబంధనల్లో భాగమే అని రఘునందన్ స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా లబ్ది దారులకు రేషన్ రసీదు ఇవ్వని డీలర్ ల పై చర్య తీసుకునే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News