Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంతెలంగాణ కేబినేట్‌ భేటీ వాయిదా

తెలంగాణ కేబినేట్‌ భేటీ వాయిదా

28న జరపాలని సిఎం నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రులు.. పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించి వారు కాంగ్రెస్‌ హైకమాండ్‌ సూచన మేరకు ఢిల్లీకి వెళ్లారు. ఇతర ఇద్దరు కీలక మంత్రులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News