Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణఖనిలో వాహనాల స్పెషల్‌ డ్రైవ్‌

ఖనిలో వాహనాల స్పెషల్‌ డ్రైవ్‌

  • మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు
  • రామగుండం ట్రాఫిక్‌ ఏసిపి శ్రీనివాస్‌

రామగుండం కమిషనరేట్‌ పరిధి గోదావరిఖనిలో రామగుండం ట్రాఫిక్‌ ఏసిపి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం వాహనాల స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించి నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనాలకు చలానాలు విధించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువ పత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫోర్‌ వీల్‌ నడిపేటప్పుడు సీట్‌ బెల్ట్‌ ధరించాలని అన్నారు. వాహనాలు అతి వేగంగా నడప రాదని ముఖ్యంగా యువకులు శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేస్తే వాహనాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎసిపి శ్రీనివాస్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సిఐ రాజేశ్వరరావు,పెద్దపల్లి ట్రాఫిక్‌ సిఐ అనిల్‌, మంచిర్యాల ట్రాఫిక్‌ సిఐ సత్యనారాయణ, ఎస్సైలు హరిశేఖర్‌, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News