Friday, October 3, 2025
ePaper
Homeసినిమా25వ సినిమా కోసం రెడీ అవుతున్న నాగచైతన్య

25వ సినిమా కోసం రెడీ అవుతున్న నాగచైతన్య

నాగచైతన్య.. కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగచైతన్యకు 24వ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్‌గా ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేశారు. నాగచైతన్య ఈ సినిమాతోపాటు తన 25వ పిక్చర్ గురించి కూడా రెడీ అవుతున్నాడు. తనతో ‘మజిలీ’ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పిన స్టోరీని ఓకే చేశాడని తెలుస్తోంది. అదే తన 25వ సినిమా అయితే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఈ చలనచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ఇప్పటికే ప్రొడ్యూజర్లు హీరోకి, డైరెక్టర్‌కి అడ్వాన్స్ సైతం‌ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్‌ దశలో ఉంది. వీరి కలయికలో వచ్చిన ‘మజిలి’ సక్సెస్ అయింది. మధ్యలో ఒక సినిమా సరిగా ఆడలేదు. దీంతో డైరెక్టర్ శివ అప్పటి నుంచి మంచి స్టోరీలపై ఫోకస్ పెట్టాడు. సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు. ఈసారి కూడా తనదైన స్టైల్‌లో మంచి భావోద్వేగాలతో కూడిన కొంచెం యాక్షన్‌ స్టోరీ రాసుకున్నాడని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఇయర్‌ఎండ్‌లో సెట్స్‌కి వెళ్లొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News