Sunday, October 5, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్ టు ఇండియా

ఇరాన్ టు ఇండియా

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్‌ గవర్నమెంట్‌ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్‌లో ఉన్న మన దేశస్తులను ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా 100 మంది భారతీయులు ఇప్పటికే టెహ్రాన్‌ నుంచి బయలుదేరారు. వాళ్లంతా ఆర్మేనియా, అజర్‌బైజాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, అఫ్గనిస్థాన్‌ మీదుగా ఇండియాకి చేరుకుంటారని తెలుస్తోంది.

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 10 వేల మంది భారతీయుల్లో ఆరు వేల మంది విద్యార్థులేనని చెబుతున్నారు. వాళ్లందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహకరించాలని ఇండియన్‌ గవర్నమెంట్‌ చేసిన రిక్వెస్ట్‌కి టెహ్రాన్‌ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం గగనతలం మూసిఉండటంతో భూసరిహద్దుల మీదుగా తీసుకెళ్లాలని ఇరాన్‌ విదేశాంగ శాఖ సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News