Friday, October 3, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఅమెరికాలో 2200 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికాలో 2200 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

రోజుకు 3 వేల మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యం

అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చినవారిపై ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 2,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిత్యం కనీసం 3 వేల మందిని అరెస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిని ముందుగా.. ఆల్టర్నేటివ్‌ టు డిటెన్షన్‌ (ఏటీడీ) ప్రోగ్రాం కింద రిజిస్టర్ చేశారు. ఇలాంటివారిని ముప్పుగా పరిగణించరు. అయినప్పటికీ వారి మోకాళ్లకు మానిటర్లను బిగించడంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లు, గూగుల్‌ లోకేషన్‌ ద్వారా వారి మూమెంట్లపై ఫోకస్ పెడతారు. కానీ.. ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసుకు రావాలంటూ వీళ్లందరికీ సందేశాలు పంపారు. అందరూ అక్కడికి చేరుకున్నాక అరెస్టు చేశారు. అందులో ఏడుగురి చేతులకు బేడీలు వేసి కారులో కూర్చోబెట్టారు. హోంలాండ్‌ సెక్రటరీ ఆదేశాల నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ చర్యలు చేపట్టింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News