Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంకావాలనే కాంగ్రెస్‌ నాయకుల రాద్ధాంతం

కావాలనే కాంగ్రెస్‌ నాయకుల రాద్ధాంతం

  • జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం
  • మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్‌ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. స్పీకర్‌ అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. కేసీఆర్‌కు ఛాంబర్‌ లేకుండా చేసినా తాము భరించామని.. పీఏసీ చైర్మన్‌ మాకు వచ్చేదైనా వారే గుంజుకున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ స్ట్రెచర్‌పై ఉన్నారని, మార్చురీకి వెళ్తారని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎదుటివారి చావు కోరుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. గడ్డం ప్రసాద్‌ గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారన్నారు. ఆయనను వ్యక్తిగా చూశామని, ఆయన కులం, మతం చూడలేదన్నారు. తాము సభకు రావొద్దని అనుకుంటున్నారా?.. చెబితే తాము ఆలోచిస్తామన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారని, సభలో అందరూ సమానమే అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. తాము స్పీకర్‌ని అమానించలేదన్నారు. నిన్న రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్‌ చెయ్యడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారు. రైతులకి ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారు.. హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనూ మమ్ములను మాట్లాడకుండా చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఒక్కరూ కాదు 20 మంది ఎమ్మెల్యేలు మంది ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News