Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణరైతు పొలంలో నోట్ల కట్టాలు..

రైతు పొలంలో నోట్ల కట్టాలు..

పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారి గా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. అవన్ని నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్‌ కరెన్సీపై ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ముద్రించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవన్నీ ఫేక్‌ కరెన్సీ అని పోలీసులు వెల్లడించారు. అసలు ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News