Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeరాజకీయంకాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా?

కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా?

  • ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే
  • బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు
  • బండి సంజ‌య్‌ని ప్ర‌శ్నించిన‌ చనగాని దయాకర్

కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్(Chanagani Dayakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. ‘‘ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పద్మశ్రీ, పద్మ భూషణ్ లల్లో తెలంగాణ రాష్ట్రపై వివక్షే అని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తెలంగాణ రాష్ట చారిత్రపై అవగాహన లేదు. గోరెటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కు మూల స్తంభాలు. కాషాయం కండువా కప్పుకున్న వాళ్లకే పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులు ఇస్తారా..? కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు బండి సంజయ్‌కి లేద‌ని అన్నారు. పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులో … రాష్ట ప్రభుత్వ సిఫారాస్‌ను అమలు చేయకపోవడం సిగ్గు చేటని, తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపిస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనమ‌ని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంట‌నే క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ కవులు, కళాకారులను కీచపరించినట్లే’’ అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News