Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్దేవాదాయశాఖ కమిషనర్‌ నియామకంపై పిటిషన్‌

దేవాదాయశాఖ కమిషనర్‌ నియామకంపై పిటిషన్‌

  • థర్డ్‌పార్టీ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి

ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రామచంద్రమోహన్‌ పోస్టింగ్‌తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించాల్సింది వాళ్లు కదా? థర్డ్‌ పార్టీ ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తి.. సర్వీస్‌ మ్యాటర్స్‌ పరిశీలించే బెంచ్‌కి ఈ పిటిషన్‌ను పంపాలని సూచించారు. హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దేవాదాయశాఖ ప్రస్తుత కమిషనర్‌ సత్యనారాయణ రిలీవ్‌ అయ్యే అవకాశముంది. నాలుగు రోజుల కిందట జరిగిన ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో దేవాదాయశాఖ కమిషనర్‌, ఆ శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సత్యనారాయణను బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో దేవాదాయశాఖ కమిషనర్‌గా రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన్ను ఎలాగైనా దేవాదాయ కమిషనర్‌ పదవి చేపట్టనివ్వకుండా కొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అర్హత లేదంటూ హైకోర్టులో గురువారం ఒకరు పిటిషన్‌ వేశారు. గతంలో సింహాచలం భూముల కేసులో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారని, సస్పెండ్‌ కూడా అయ్యారని, విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, అప్పట్లో కోర్టును తప్పుదోవ పట్టించి మళ్లీ ఉద్యోగంలో చేరారని అందులో ప్రస్తావించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. థర్డ్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News