Saturday, October 4, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

  • అత్యుత్తమ పనితీరుకు ఇది దోహద పడుతుంది
  • డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం

ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని.. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు ఏళ్ల తరబడి పెండిరగ్‌లో ఉండిపోవడం వల్ల ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండిరగ్‌లో ఉన్నాయని.. ఇలా అపరిష్కృతంగా ఉండటం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగులు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందలేకపోతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన విచారణలకు సంబంధించిన విచారణలు ఏళ్ల తరబడి పెండిరగ్‌లో ఉండటంపై పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌., అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంతకాలంగా పెండిరగ్‌లో ఉన్నాయనే అంశంపై ఆరా తీశారు. అందుకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. నివేదికను మూడు వారాల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. అయితే, అభియోగాలు వచ్చిన వారిపై విచారణ ప్రారంభించినపుడు దానికి తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదని, ఇది విచారణలో జాప్యానికి కారణం అవుతోందని అధికారులు పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. తన శాఖల పరిధిలో విజిలెన్స్‌ రిపోర్టుల ఆధారంగా తీసుకునే చర్యల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు సూచించారు. ఏదైనా విషయంలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్బందీగా జరపాలన్నారు. ప్రాథమిక విచారణలోనే బలమైన ఆధారాలు సేకరించాలన్నారు. విచారణ అధికారి, ఆరోపణలు వచ్చిన ఉద్యోగికి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేకుండా తొలి దశలోనే నిరోధించాలని స్పష్టం చేశారు. అన్ని విజిలెన్స్‌, నాన్‌ విజిలెన్స్‌ కేసులను సరైన, సక్రమమైన పద్ధతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖల అధిపతులు దృష్టి సారించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News