Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్ముగిసిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్

ముగిసిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్

శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి సమర్పించిన హైదరాబాద్ సూపర్ లీగ్ యూత్ కప్, లియో 11 వేదికపై ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో విజయవంతంగా ముగిసింది. నవంబర్ 11 నుండి డిసెంబర్ 29 వరకు, అండ‌ర్ 13 విభాగంలో నాలుగు జట్లు, అండ‌ర్ 19 విభాగంలో ఎనిమిది జట్లు అద్భుతమైన 7-ఎ-సైడ్ ఫార్మాట్‌లో పోటీ పడ్డాయి. అసాధారణ ప్రతిభను క‌న‌బ‌ర్చాయి. హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ ద్వారా నిర్వహించబడిన యూత్ కప్ ఈ ప్రాంతంలో అట్టడుగు స్థాయి ఫుట్‌బాల్ అభివృద్ధిని పెంపొందించుకుంటూ ఔత్సాహిక యువ ఆటగాళ్లకు ఒక వేదికను అందించింది. హైదరాబాద్ సూపర్ లీగ్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ సీఈఓ మొహమ్మద్ ఫైజ్ ఖాన్ మద్దతు, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సి, డెకాథ్లాన్ మరియు ఇండియా ఖేలో ఫుట్‌బాల్‌లోని ప్రముఖుల ప్రోత్సాహంతో, లీగ్ భారత ఫుట్‌బాల్‌లో ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News