- బస్తీల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు పాల్గొన్న ఆలకుంట హరి
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఆలకుంట హరి పలు బస్తీలలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా తార్నాక డివిజన్ పరిధిలోని యువత యువజన సంఘాల ప్రతినిధులు నాగార్జున నగర్,కిమితి కాలనీ,మాణికేశ్వరి నగర్,యూనివర్సిటీ బస్తీలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలకుంట హరి మాట్లాడుతూ తార్నాక డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ స్వాతంత్ర్య సాధనకు ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ తార్నాక డివిజన్ అధ్యక్షులు గండికోట విజయకుమార్,మాణికేశ్వరి నగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఆలకుంట వెంకటేష్,బి.ఆర్.ఎస్ మైనార్టీ నాయకులు ఎండ్ కాజా పాషా,ఎం.డి ఇమ్రాన్,గంగపుత్ర సంఘం నాయకుడు సత్యనారాయణ,లోకేష్,నరేందర్,వరికుపల వెంకటేష్,మాణికేశ్వరి నగర్ ఫేస్ టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్,బురాన్,ఇస్మాయిల్,పవన్,ఆలకుంట కుమార్ తదితరులు పాల్గొన్నారు.
