- గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా ఆవిష్కరణ చేసిన నోముల ప్రకాష్ రావు గౌడ్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ సీతాఫల్మండి డివిజన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పలు కాలనీలు,కూడళ్లలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.స్థానికుల ఆహ్వానం మేరకు సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీతాఫల్మండి గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నోముల ప్రకాష్ రావు గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,యువత రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.వేడుకల్లో పాల్గొన్న ప్రజలు వందేమాతరం,భారత్ మాతాకీ జై”నినాదాలతో ప్రాంతాన్ని దేశభక్తి ఉత్సాహంతో మార్మోగించారు.అనంతరం అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మోహన్,శ్రీనివాస్,బండి లక్ష్మణ్,నాగేష్ గౌడ్,తిరుపతి,బాలరాజు యాదవ్,శ్రీశైలం యాదవ్,సత్యం గౌడ్,మున్నూరు చందు,బెజాడి కిరణ్,బ్రహ్మం,నర్సింగ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
