77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మేయర్,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక చంద్రారెడ్డి,బీజేపీ రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి తదితరులు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం నాడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తార్నాక చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు,పండ్లు పంపిణీ చేశారు.అనంతరం తార్నాక లేబర్ అడ్డా,ఆటో యూనియన్, నార్త్ లాలగూడ,సీతాఫల్మండి తదితర ప్రాంతాల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
