- అడ్డగుట్ట డివిజన్ పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి
జై భారత్ వందేమాతరం నినాదాల హోరు మూడు రంగుల జెండా ఆవిష్కరణలతో వాడ వాడలా మువ్వన్నెల జెండాలతో యువత జోరు కనిపించింది. సోమవారం నాడు 77వ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్ జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.అడ్డగుట్ట బస్టాప్,బాబు జగజ్జీవన్ రామ్ భవన్,తుకారాం గేట్,ఏ సెక్షన్, బి సెక్షన్,డి సెక్షన్,ఇందిరా నగర్,శాంతి నగర్,తదితర ప్రాంతాల్లో స్థానిక సంఘాల యువత ప్రజా సంఘాల ప్రతినిధులు కాలనీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ల ఆహ్వానం మేరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మీ మాట్లాడుతూ,భారత రాజ్యాంగమే దేశానికి పునాది అని,స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని పేర్కొన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని
