హైదరాబాద్, బహదూర్‌పుర నియోజకవర్గంలోని కాలువగడ్డ చౌరస్తాలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఉదయ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలను కల్పించిందని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే నేడు మనం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతున్నామని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ, దేశభక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధిస్తోందని, యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. గణతంత్ర దినోత్సవం మనకు కర్తవ్యబోధను గుర్తు చేసే పర్వదినమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
