ప్రపంచవ్యాప్తం(Worldwide)గా 5జీ నెట్‌వర్క్(5G Network)ను వాడే వారి సంఖ్య విషయంలో ఇండియా(India) సెకండ్ ప్లేస్‌లో ఉంది. మన దేశంలో 40 కోట్ల మందికి పైగా 5జీ నెట్‌వర్క్ వినియోగదారులు ఉండటం గమనార్హం. 110 కోట్ల మందితో చైనా(China) మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి (Union Minister) జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) సామాజిక మాద్యమం వేదికగా శుక్రవారం వెల్లడించారు. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా (America) సైతం ఇండియా తర్వాతే 3వ స్థానానికి పరిమితమైంది. 20 కోట్ల మందితో యూరోపియన్ యూనియన్ 4వ ప్లేస్‌లో, 19 కోట్ల మందితో జపాన్ 5వ స్థానంలో ఉంది. ఇండియాలో 5జీ సర్వీసులు నాలుగేళ్ల కిందట 2022లో ప్రారంభమయ్యాయి. మూడు ప్రైవేట్ సంస్థలు(జియో, ఎయిర్‌టెల్, వీఐ) ఇప్పటికే ఈ సేవలు అందిస్తుండటం ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్‌ఎల్(BSNL) త్వరలో ఆరంభించనుంది.

