Tuesday, April 7, 2026
Homeరంగారెడ్డిPrajavani | ప్రజావాణికి(56) ఫిర్యాదులు..!

Prajavani | ప్రజావాణికి(56) ఫిర్యాదులు..!

సమీకృత రంగారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (56) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీత కి విన్న విస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ సంగీత మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ– 9 , ఇతర శాఖలు – 47, మొత్తం 56 దరఖస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News