Wednesday, March 4, 2026
HomeతెలంగాణHarish Rao | కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ లో రేవంత్ యాక్షన్

Harish Rao | కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ లో రేవంత్ యాక్షన్

  • ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్త డిస్కమ్ ఎందుకు?
  • విద్యుత్లో రూ.50వేల కోట్ల స్కాంకు తెర..
  • కొత్త డిస్కమ్.. థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో కమీషన్లు
  • విద్యుత్ శాఖను ఏపీ ప్రభుత్వం నడుపుతోందా?
  • ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్ ఇస్తామంటే తీసుకోరా
  • మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉండగా కొత్త డిస్కమ్ ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లోనే రేవంత్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. కమీషన్లను దండుకునేందుకే ఇలాంటి స్కామ్లకు తెరదీశారు. ఇలా ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ రూ.50వేల కోట్ల స్కాంకు తెరలేపిందని హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మల్ విద్యుత్ను తగ్గిస్తామన్న ప్రభుత్వం.. కొత్త ప్లాంట్లు ఎందుకు నిర్మిస్తోందని ప్రశ్నించారు.

సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అధికారులను అవమానించిన కుమార్ రాజాను వెంటనే తరిమికొట్టాలని హెచ్చరించారు. అండర్ గ్రౌండ్ కేబుల్స్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ కరెంట్ సహా ఇంటర్ప్రైట్ స్కామాూ త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతాం అని తెలిపారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రంలో రూ.50 వేల కోట్ల స్కాంను బయట పెట్టినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. థర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామని చెప్పి కొత్త ప్లాంటు ఎందుకు కడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ.10,800 కోట్లతో జెన్కో డీపీఆర్ ఇచ్చింది. వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

- Advertisement -

ఎన్టీపీసీ వాళ్లు రూ.4.12 పైసలకు యూనిట్ ఇస్తామంటే ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు .ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. రామగుండం కొత్త ధర్మల్ ప్రాంట్ తో రోజూ ప్రజలపై రూ.9 కోట్ల భారం పడుతుందని చెప్పారు. 25 ఏండ్లకు కొత్త ప్లాంట్ తో ప్రజలపై రూ. 82 వేల కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వచ్చే విద్యుత్ ను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. రూ.82 వేల కోట్ల భారం ప్రజలెందుకు భరించాలన్నారు. హరీశ్, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే కరెంట్ లో ఈ దుస్ధితి వచ్చిందన్నారు. విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.

ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ.. రూ.4.12 పైసళ్లకు యూనిట్ విద్యుత్ ఇస్తామంటే తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ముందుకు రాలేదు? అని నిలదీశారు హరీశ్రవు. ఎన్టీపీసీ ఇచ్చే తక్కువ ధర కరెంటును కాదని.. సొంతంగా విద్యుత్ ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తామని అంటున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ రంగంలో ఈ దుస్ధితి నెలకొందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖను తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా..? లేదా ఏపీ ప్రభుత్వం నడుపుతుందా? అని ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖలో తిష్టవేసుకుని కూర్చున్న ఆంధ్ర ప్రాంత అధికారులను వెంటనే సాగనంపాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను సీఎం పరోక్షంగా ప్రభావితం చేస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. పట్టణాల్లో సీఎం తిరుగుతానంటే ఎలా అని నిలదీశారు హరీశ్రావు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News