Saturday, March 14, 2026
Homeరంగారెడ్డిDonation | శివాజీ విగ్రహ ప్రతిష్టకు 50వేల విరాళం.

Donation | శివాజీ విగ్రహ ప్రతిష్టకు 50వేల విరాళం.

  • ఎంకిర్యాల నరసింహాను అభినందించిన గ్రామస్తులు.

చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని, అన్యాయంపై ఎదిరించే మనస్తత్వము అలవాటు చేసుకున్న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని నందిగామ మండల పరిధిలోని నర్సాప్పగూడ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎంకిర్యాల నరసింహా శివాజీ విగ్రహము ఏర్పాటుకు ముందుకు వచ్చి తన వంతు సహాయంగా 50వేల రూపాయలు చందాగా రాసి, విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరు శివాజీ జీవితం,ఆయన ధైర్య సాహసాల గురించి తెలుసుకోవాలన్నారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళం అందించిన నరసింహాని గ్రామస్థులు, యువజన సంఘాల సభ్యులు అభినందించారు. నరసింహాను ఆదర్శంగా తీసుకుని పలువురు స్వచందంగా వచ్చి విరాళాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోడిచర్ల శీను,నీరటి మహేందర్,మెండే కృష్ణ,నారాయణ,వెంకటేష్, అశోక్, రఘ, సురేష్, రజనీకాంత్, సిద్దు, ఆంజనేయులు, వజ్రం, రాములు, శీను,రాములు,కిష్టయ్య,యువజన సంఘాల సభ్యులు,గ్రామస్థులు పాల్గొన్నారు…

- Advertisement -
RELATED ARTICLES

Latest News