Friday, October 3, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు.

ఆన్‌లైన్‌లో అప్లై చేయటానికి ముందు NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. కనీస వయసు 20 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. ఎంపికైనవారికి నెలకు రూ.15 వేలు స్టైపెండ్ ఇస్తారు. పూర్తి వివరాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు

RELATED ARTICLES
- Advertisment -

Latest News