సౌదీ అరేబియా(Saudi Arabia)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 45 మంది హైదరాబాదీలు (Hyderabadis) చనిపోయారు. వీరిలో నగరంలోని మల్లేపల్లి బజారుఘాట్‌కు చెందినవారితోపాటు ఇతర ఏరియాలవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మల్లేపల్లి బజార్‌ఘాట్ వాసుల్లో 18 మంది మరణించారు. మెహిదీపట్నం(Mehdipatnam)లోని ఒక ఫ్లైజోన్ ఏజెన్సీ (Flyzone Agency) ద్వారా టికెట్లు బుక్ చేసుకొని ఈ నెల 9న ఉమ్రాకు వెళ్లారు. మక్కా (Mecca) యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకొని మదీనా(Madeena)కు వెళుతున్నప్పుడు దుర్ఘటన జరిగింది. మదీనాకు పాతిక కిలోమీటర్ల దూరంలో బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.
- Advertisement -
